జూలై 12,1949లో సంత్ గాడ్గే బాబా అంబేడ్కర్ తో సమావేశమైన రోజు
✍️ అరియ నాగసేన బోధి
సంత్ గాడ్గే బాబా అసలు పేరు దేవదాస్ దేబు జీ జింగర్జీ జోధాకర్ .మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల షేన్ గావ్ అనే చిన్న గ్రామంలో ఒక రజక (చాకలి) కుటుంబంలో జింగ్రా, సక్కుబాయిలకు 1870 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. గాడ్గే బాబా సత్యాన్వేషణ కోసం ఆనాడు గౌతమ బుద్ధుడు చేసిన త్యాగం వలె తను కూడా తన భార్య, కుమార్తె అలోకను విడిచి పెట్టి సన్యాసిగా మారారు. రజక కుటుంబంలో ఒక రైతు గాడ్గే బాబా. బుద్ధుడు ఎలా అయితే ఒక భిక్షా పాత్ర, చీవరాలు చిరిగితే కుట్టుకోవడానికి సూది దారం తన దగ్గర పెట్టుకున్నారో గాడ్గే బాబా కూడా వీధులు శుభ్రం చేయడానికి కేవలం ఒక చీపురు, ఒక భిక్షా పాత్రనే తన ఆస్తిగా తన దగ్గర పెట్టుకున్నారు. మరాఠీ భాషలో మట్టి చెప్పనే గాడ్గే అని పిలుస్తారు. ఈ మట్టి తో చేసిన మూకుడును తన భిక్షా పాత్రగా ఉపయోగించి తర్వాత శుభ్రం గా కడిగిన తర్వాత మట్టిపాత్రను తన తలపైన టోపీగా ధరించేవారు. మరాఠీ భాషలో విరిగిన మట్టి కుండను గాడ్గే అని అంటారు. గాడ్గే బాబా మట్టి పాత్రను తలపై ధరించడంతో అలా అతనికి గాడ్గే బాబా అని పేరు వచ్చింది.
గాడ్గే బాబా సమాజంలో గల కులం పోవాలని, తన పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. గొప్ప వాగ్గేయకారుడు గాడ్గే బాబా. ప్రకృతి ప్రేమికుడు.కాలినడకన ప్రయాణిస్తూ ఊరూరా తిరిగి వీధులు ఊడ్చి ఒక చోట జనాన్ని సమీకరించి చక్కని స్వరంతో పాటలు పాడి కులవ్యవస్థ ను పారద్రోలాలని ప్రజలకు బోధ చేసేవారు. సంత్ కబీర్, రవిదాస్ ల ప్రభావం సంత్ గాడ్గే బాబాపై ఉంది. సంత్ రవిదాస్ పుట్టిన నాడే గాడ్గే బాబా పుట్టారు. సంత్ కబీర్, సంత్ రవిదాస్ లు బ్రాహ్మణీయ మనుస్మృతి పై పోరాటం చేసినట్లే సంత్ గాడ్గే బాబా కూడా బ్రాహ్మణీయ మనుస్మృతిని.వ్యతిరేకించారు. గాడ్గే కుల వ్యవస్థ నిర్మూలన కోరుకున్న మహనీయులు సంత్ కబీర్, సంత్ రవిదాస్, గాడ్గే బాబాలు.
అయ్యాలారా ! దేవుడి గుడిలో దేవుడు ఉండడు దేవుడి గుడిలో బాపనోడి కడుపు ఉంటుంది అని మరాఠీలో గాడ్గే మహారాజ్ పాట పడేవారు
డా. అంబేడ్కర్ కన్నా 15 సంవత్సరాలు వయస్సు లో పెద్దవారు గాడ్గే బాబా మహారాజ్. గాడ్గే బాబా ఎందరో రాజకీయ నాయకులను చూశారు కానీ డా అంబేడ్కర్ వంటి మహోన్నతమైన నాయకుణ్ణి ఆయన చూడలేదు. అందుకే గాడ్గే బాబా డా అంబేడ్కర్ ను ఎంతో ఎక్కువగా అభిమానించారు.డా.అంబేడ్కర్ కూడా గాడ్గే మహారాజ్ గురించి చెబుతూ మహాత్మా జోతిరావు ఫూలే తర్వాత గొప్ప సంఘస్కర్త గాడ్గే బాబా మహారాజ్ అని తరచుగా చెబుతుండేవారు.
డా.అంబేడ్కర్ తరచుగా గాడ్గే బాబాను కలుస్తూ ఉండేవారు. సంఘసంస్కరణలకు సంబంధించిన విషయాలపై చర్చిస్తూ ఉండేవారు.అంబేడ్కర్ అంతటి డిగ్రీలు ఉన్న మేధావి ఒక మాములు సన్యాసి తో చర్చలు జరిపేవారంటే గాడ్గే బాబా ఎంతటి గొప్ప వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం అంబేడ్కర్ అంతటి మేధావి లో గల మైత్రీపూర్వకమైన మనస్తత్వం కూడా మనం గమనించవచ్చు. ఒక రాజకీయ నాయకునిగా, మేధావిగా ఉన్న అంబేడ్కర్ సామాన్య సన్యాసితో సమాజం గురించి చర్చించేవారంటే మనం కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి.
1949 జూలై 12 న గాడ్గే బాబా డా.అంబేడ్కర్ ను పండరీపురం లో కలుసుకున్నారు.పండరీపురంలో గల పాండురంగని గుడిలోకి వెళ్ళడానికి అంబేడ్కర్ ప్రయత్నించగా బ్రాహ్మణులు,పూజారులు ఆయణ్ణి అడ్డుకున్నారు. అంబేడ్కర్ మహర్ కులానికి చెందిన వారవడంతో బ్రాహ్మణులు గుడిలోకి రానీయలేదు. పండరీపురంలో ఉన్న చోకామేళా సమాధి దగ్గర ఒక హద్దు గీసారు. ఒక మహర్ కులం వాళ్ళు ఆ హద్దు దాటి రాకూడదని పూజారులు అడ్డుకున్నారు. చోకామేళా అనే మహర్ ను ఆనాడు గుడిలోకి రానివ్వలేదు. నేడు అంబేడ్కర్ ను రానివ్వలేదు. చోకామేళా పాండురంగని గుడి దగ్గరే చంద్రభాగ నది వద్ద ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండేవారు.ఆఖరికి చోకామేళా ను గుడి తలుపు దగ్గరకు కూడా రానీయలేదు.
డా.అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6 న నిర్యాణం చెందడంతో గాడ్గే బాబా అంబేడ్కర్ వంటి మహనీయుడు లేని ఈ భారతదేశంలో బహుజనుల బతుకులు ఏమైపోతాయోనని తీవ్రమైన బెంగతో గాడ్గే బాబా మహారాజ్ 1956 డిసెంబర్ 20న నిర్యాణం చెందారు.
దాచబడిన బహుజనుల చరిత్రను అందరూ తప్పకుండా మీ ముందు తరానికి తెలియజేయండి.
బహుజనులే ఈ దేశాన్ని న్యాయంగా పాదించాలి. చెంచాల వలన బహుజనుల రాజ్యం రావడం లేదు. RSS చెంచాలు నశించాలి. మనువాదులు నశించాలి
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """ """" """ """ """ """ """ """ """ """
ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 50, 100, 500 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
చందా పంపించిన తరవాత మీ పేరు జిల్లా పేరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది మా వెబ్సైట్ లోని చందాదారుల లిస్ట్ పై వ్రాయబడను.
Please Help this Website by Donating Rs 50, 100, 500 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Please send message on WhatsApp giving your Name & City or District after making Payment so that we shall publish Donors list on our Websites.
Regards
Hemantkumar Baddy
..........................................☘☘☘