1894 లో చత్రపతి సాహూ మహరాజ్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు. చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ నిజానికి జాతీయోద్యమం, బ్రాహ్మణ సంస్కృతిని ఆచరించి ఉండవలసింది. కానీ అందుకు భిన్నంగా అతను మహాత్మా పూలే నిర్వహించిన సత్యశోధక ఉధ్యమ వారసత్వాన్ని ఎన్నుకున్నాడు.
తన సంస్థానంలో విద్య, వైద్యం, పోలీసు, న్యాయవ్యవహారాలు, రెవెన్యూవంటి శాఖల ప్రత్యేక విభాగాలకు పరివేక్షణ అధికారులంతా బ్రాహ్మణలచే నిండి ఉండేది. డాక్టర్లు, బారిస్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఉన్నతస్థానాలన్ని బ్రాహ్మణనులే ఆక్రమించారు. ఇలా సామాజిక, పాలనా రంగాలలో బ్రాహ్మణధిక్యత పెరగటం వలన వైదిక హిందూ పిఠాధిపతుల వైఖరిలో మార్పు వచ్చింది. జగద్గురు శంకరాచార్య పీఠం కూడా ఆధ్యాత్మిక వ్యవహారాల కన్నా రాజకీయ విషయాలకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇలాంటి శక్తులను బ్రిటీష్ ప్రభుత్వం అదుపు చెయ్యటానికి ఏమాత్రం ప్రయత్నంచలేదు.
మరాఠా (కాపు) వంశం నుండి వచ్చిన సాహూ మహారాజ్ ఈ సమస్యను బాగా అర్ధంచేసుకున్నాడు. మరాఠాలను, ఇతర బ్రాహ్మణనేతరులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకోస్తే తప్ప, వాళ్ళ సామాజిక హోదాలో మార్పు రాదని భావించిన సాహూ కు సమస్యకు మూలం ఎక్కడుందో అర్ధమైంది. పదవులకు అవసరమైన విద్యా అర్హతలు బ్రాహ్మణనేతరులకు బొత్తిగా లేవు. ముందుగా వాళ్ళకు ఆధునిక విద్యావిధానంలో ప్రవేశం కల్పిస్తే తప్ప ఉద్యోగాలు యివ్వడం వీలుపడదు. వెంటనే వెనుకబడిన కులాల పిల్లల కోసం స్కూళ్ళు, హాస్టళ్ళను ప్రారంభించాడు. దీంతో బ్రాహ్మణలు గగ్గోలు పెట్టారు. రాజభవనంలో అన్ని కార్యక్రమాలు రాజ పురోహిత పౌరాణిక విధానంలో నిర్వహించడాన్ని సాహు అడ్డుకుని వేదోక్తకంగా నిర్వహించాలని ఆదేశించాడు. శూద్రులకు వేదోక్తంగా విధులను నిర్వహించడం శాస్త్ర విరుద్ధమని తెగేసి చెప్పారు పురోహితులు. వారి ఉద్యోగాలను పికేసినా వారి భూములను ఆయన లాక్కున్నా బ్రాహ్మణులు షాహు ను ఖాతరు చేయలేదు. పైగా ఆయనపై బ్రిటిష్ ప్రభుత్వానికి పిర్యాదులు చేశారు. కుహన జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ కూడా సాహూ కు వ్యతిరేకంగా నిలబడ్డాడు. బ్రిటీష్ ప్రభుత్వం బ్రాహ్మణ పురోహితులకు - సాహూ కు మధ్య సమాధానం కుదిర్చి ఇకపై ఆయనకు వైదిక కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణుల భూములను తిరిగి ఇచ్చివేయాలని తీర్పు చెప్పింది. దీనితో బ్రాహ్మణనేతరులు సామాజికంగా ఎంత వెనుకబడి ఉన్నారో సాహూ కు మరింత అర్ధం అయింది. ఈ అవగాహన ఆయనను గొప్ప సామాజిక సంస్కర్తగా తీర్చిదిద్దింది.
ఛత్రపతి సాహూ చేపట్టిన సామాజిక సంస్కరణలు : వెనుకబడిన (బీసీ, ఎస్సి, ఎస్టి) కులాల పిల్లలకు ఉచిత విద్యావకాశాలు, హాస్టల్ వసతి కల్పించడం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, వ్యవసాయ దారులకు ప్రత్యేక సౌకర్యాలు, సామాజిక దురాచారాల నిర్మూలనకు చట్టాల రూపకల్పన, అస్పృశ్యత నివారణ, వెట్టిచాకిరి రద్దు, తరతరాల నుండి వంశపారంపర్యంగా బ్రాహ్మణులు అనుభవిస్తున్న కులకర్ణి పదవుల రద్దు ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రామాలు చేపట్టి భారత దేశంలోనే విలక్షణమైన ప్రజాపాలకుడిగా పేరు గాంచాడు.
1902 జులై 26 న, సాహూ మహారాజ్ వెనుకబడిన కులాలకు 50% రిజర్వేషన్లు ప్రకటించి అమల్లో పెట్టిన మొట్టమొదటి సమత పాలకుడు. ఇదే రోజును రిజర్వేషన్ల డే గా దేశం జరుపుకుంటుంది. ఆ తరువాత 1918లో మైసూర్ లోనూ, 1921లో మద్రాస్ లోనూ, 1925లో బొంబాయి లోనూ రిజర్వేషన్లు ప్రారంభమైనాయి. ఆ విధంగా ఛత్రపతి సాహూ నేటి భారత రాజ్యాంగానికి స్పూర్తినిచ్చారు.
---- మూల్ నివాసి మాల - 98690 10890
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
చందా పంపించిన తరవాత మీ పేరు జిల్లా పేరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది మా వెబ్సైట్ లోని చందాదారుల లిస్ట్ పై వ్రాయబడను.
Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Please send message on WhatsApp giving your Name & City or District after making Payment so that we shall publish Donors list on our Websites.
Regards
Hemantkumar Baddy
..........................................☘☘☘