ఇదే రోజు 1947 లో బాబాసాహెబ్ రాజ్యాంగ పరిషత్ లో ప్రవేశం


1946లో భారత రాజ్యాంగం రాయడానికి "రాజ్యాంగ పరిషత్" ఏర్పడింది.


భారత రాజ్యాంగం రాయడాని 389 సభ్యులు ఎన్నుకోబడాలి.


కాంగ్రెస్ పార్టీ తన ధన బలంతో 386 మంది సభ్యులను గెలిపించుకుంది.


ఈ రాజ్యాంగ పరిషత్ లో మూల్ నివాసీ బహుజనుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులను రాజ్యాంగ చట్ట సభలో పొందుపరచడం కోసం, వారి జీవన భద్రతతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించి పట్టడం కోసం భారత రాజ్యాంగ రచనా బాధ్యతను తన  చేతిల్లోకి తెచ్చుకోవాలన్న తపనతో బోంబే నుండి షెడ్యుల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల బరిలో నిలబడినప్పుడు.


కాంగ్రెస్ పార్టీ ఒక ఏడవ తరగతి ఫెయిల్ అయినా వ్యక్తిని తీసుకొవచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ పై పోటీకి నిలబెట్టి ధనము, మద్యము ఆ ఓటర్లను ఎరచూపి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించింది.


రాజ్యాంగ రచనా బాధ్యత బాబాసాహెబ్ చేజారి పోయింది. 


బాబాసాహెబ్ ఓటమి గురించి తెలుసుకొని ఆ వెనువెంటనే బెంగాల్ కు చెందిన నామశూద్రుడు జోగేంద్రనాధ్ మండల్ బాబాసాహెబ్ ను కలిసి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జైసూర్, కల్నా జిల్లాల నుండి రాజ్యాంగ పరిషత్ కు పోటీ చేయించి ఆ ప్రాంతంలో నామ శూద్రుల జనాభా 63% బాబాసాహెబ్ కు అఖండ మెజారిటీ తో గెలిపించారు.


బాబాసాహెబ్ రాజ్యాంగ పరిషత్ ప్రవేశాన్ని తట్టుకోలేక ఆధునిక మనువుల కాంగ్రెస్ బాబాసాహెబ్ గెలుపొందిన ప్రాంతాన్ని వెంటనే బెంగాల్ విభజన పేరుతో 63%గా నామశూద్రులు (నేడు హిందువు) తూర్పు బెంగాల్ ను పాకిస్థాన్ లో  విలీనం చేయించి నామ శూద్రలను పాకిస్థాన్ లో త్రోసివేశారు.


బాబాసాహెబ్ ని భారత రాజ్యాంగాన్ని రచించడానికి బదులు పాకిస్థాన్ రాజ్యాంగాన్ని రచించే పరిస్థితిలోకి నెట్టివేయడంతో బాబాసాహెబ్ గత్యంతరం లేని అవమానకరమైన పరిస్థితిలో పడ్డారు.


ఆ వేనువెంటనే జవహర్ లాల్ నెహ్రు, సరోజినినాయుడు ఇద్దరు కలసి ఐరిష్ దేశానికి చెందిన ఒక గొప్ప రాజ్యాంగ రచనా నిపుణుడైన సర్ ఐవర్ జెన్నింగ్ ని కలుసుకొని ఎంత మూల్యం ఐనా చెల్లిస్తాం భారత రాజ్యాంగం రాయండని అభ్యర్థిస్తారు.


అప్పుడు వీరిని చూచి జెన్నింగ్ ఆశ్చర్య పోతాడు.


"నేను రాజ్యాంగ నిపుణుడుగా చాల పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ నేను వివిధ దేశాల రాజ్యాంగాలను రచించే సమయంలో నాకు కలిగే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీ దేశంలో ఉన్న బాబాసాహెబ్ వద్దకు వచ్చి ఆయన దగ్గరే కొన్ని రోజుల పాటు ఉండి నా సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసుకుంటాను. మీరు ఇంత దూరం రావడం హృధా అని అంటాడు.


నెహ్రు, సరోజిని నాయుడు తిరిగి భారత్ వచ్చారు.


బాబాసాహెబ్ బ్రాహ్మణీయ కాంగ్రెసు చేసిన కుట్ర కుతంత్రాలను జోగేంద్రనాద్ మండల్ తో కలిసి భారత దేశ చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ వద్దకు వేళ్ళి, బాబాసాహెబ్ బోంబే ఓటమి నుండి, జైసూర్, కూల్నా జిల్లాల నుండి రాజ్యాంగ పరిషత్ కు ఎన్నిక వరకు, కాంగ్రెస్ చేసిన దుశ్చేష్టల గురించి ఒక వినతి  పత్రాన్నివ్వటం తో మౌంట్ బాటన్  ఆశ్చర్య పోయి ఆ మరుసటి రోజు భారత దేశాన్ని ఇప్పుడు స్వాతంత్ర్యం ఇవ్వడం లేదని మరో పది సంవత్సరాల వరకు స్వాతంత్ర్యం మాట ఎత్తవద్దని మౌంట్ బాటన్ ప్రకటించారు.


అప్పుడు గత్యంతరం లేక కాంగ్రెస్ బోంబే నుంచి పోటీ చేసి రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా ఎన్నికైన ఎమ్.ఆర్.జయకర్ చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో 14--8--1947 న బాబాసాహెబ్ ని పోటీలో నిలబేట్టి గెలిపించి రాజ్యాంగ పరిషత్ లో ప్రవేశం కల్పించి ఆ మరుసటి రోజు 15--8--1947 న బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది.


బాబాసాహెబ్ మన కోసం భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని అవమానాలు, అవరోదాలను ఎదుర్కొన్నాడో మన వాళ్ళకు చాలా మందికి తెలియదు.


కొంతమంది తెలిసిన వాళ్ళు మను వాదుల ముద్ద కోసం అంబేద్కర్ ను , మన బహుజనలను ద్రోహం చేశారు, ద్రోహం చేస్తున్నారు.


కాబట్టి ఫూలే - అంబేద్కర్ వాదులు ఆధునిక మనువుల శక్తుల నుంచి మన మూల్ నివాసీ బహుజనులను విడిపించాలని అంబేద్కర్ ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఓటు అనే ఆయుధంతో ఈ దేశానికి పాలకులు కావాలి. 


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """


ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.


గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Regards


Hemantkumar Baddy
..........................................☘☘☘