విశ్వానికే శాంతి కరుణ మైత్రి అనే గొప్ప మానవీయ సందేశాల్ని ఇచ్చిన తథాగత్ గౌతమ బుద్ధుడు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పినందుకు మీరు ధన్యులు. దేశంలో పుట్టిన బుద్ధుడు బౌద్ధం ప్రపంచంలోని యాబైఆరు దేశాల్లో రాజ్యాధికారంలో ఉంది. తిరిగి 1956లో డాక్టర్ అంబేడ్కర్ భారత వనిలో బౌద్ధాన్ని పునర్జీవింపజేశారు. దానినే గగ్గుపల్లి ఊరి ప్రజలు తమ నడి గ్రామంలో పునరస్థాపించి నందుకు మా సమస్త ముంబైకర్ల తరపున సెల్యూట్ అంటూ ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం మాజీ జాతీయ ఉపాధ్యక్షులు మూల్ నివాసి మాలజీ వెల్లడించారు. జైభీం అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా నిజామాబాద్ ఆర్మూర్ గగ్గుపల్లి గ్రామంలో బుద్ధుడి విగ్రహం దర్శన కార్యక్రమం జరిగింది. ఆరంభంలో వచ్చిన అతిథులకు జైభీం నినాదాలతో స్వాగతం పల్కారు. సామూహిక బుద్ద వందనం జరిపినాంతరం మాలజీ పైవిధంగా ప్రబోధనం చేశారు. తోడుగా విచ్చేసిన "జైభీం శివశక్తి" నేత దోన్కంటి లింగం మాట్లాడుతూ విగ్రహం పట్ల ఊర్లో కొందరు రభస చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసోసియేషన్ వారి న్యాయమైన పోరాటానికి తమ అన్నివిధాలా మద్దతు ఉంటుందని ఆయన హమిచ్చారు. ఇందులో జర్నలిస్టులైన కాపు బోజన్న, అంగుళి మాలజీ, మామిడి రాజు పాల్గొన్నారు. ఇట్టి ప్రోగ్రాం సక్సెస్ కోసం అసోసియేషన్ అధ్యక్షులు బి.ధర్మపూరి, ఉపాధ్యక్షులు జి.నవ బోజన్న, ప్రధాన కార్యదర్శి మంతెన రవి, మదారి ఆకాష్, మంతెన లాజర్, కొండి సురేష్ లు కృషి చేశారు.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Regards