ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ !

 *దళిత విద్యార్థిపై రాడ్‌క్లిఫ్ స్కూల్ దౌర్జన్యం

*ఎస్సి ఎస్టి ఓబీసీ ఎస్.బీ.సీ లకు కుల ధ్రువీకరణ పత్రం కావాలి

సీబీడి బేలాపూర్‌ 03.08.2023 : 3 ఆగస్టు 2023న ఓ దళిత బాలిక విద్యార్థిని ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు నవీముంబైలోని సీబీడి బేలాపూర్‌లోని కొంకణ్ డివిజనల్ కమీషనర్ కార్యాలయం ముందు భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) చే నిరసన జర్పారు. ఉల్వేలోని రాడ్‌క్లిఫ్ స్కూల్‌లో ఓ విద్యార్థిని ఫీజు చెల్లించే వరకు పాఠశాలకు రానివ్వకుండా నిలుపుదల చేసి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం "హామీ ఇవ్వబడిన విద్యను" పాఠశాల ద్వారా కోల్పోయింది. ఇది  శిక్షార్హమైన U/s 341, 34 IPC r/w 3(2)(va), 6 SC & ST (POA) చట్టం, 1989 సవరించిన నేరాలకు సంబంధించింది. 
ఐతే దేశ పీఎం “బేటీ బచావ్ బేటీ పడావో” అంటారు కానీ వాస్తవానికి బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలు చేయడం లేదు.

 అనేక సందర్భాలలో ఫీజులు ఆలస్యంగా చెల్లించినందుకు ప్రైవేట్ స్కూల్ కళాశాలలు విద్యార్థులను బెంచీలపై లేదా తరగతి గదుల వెలుపల నిలబెట్టడం, వారికి లీవింగ్ సర్టిఫికేట్‌లను అందజేయడం జరుగుతున్నాయి. అట్టి స్కూల్ మేనేజ్‌మెంట్‌ వేధింపులను వెంటనే ఆపాలాంటు బిఆర్ఎస్ పార్టీ కమీషనర్ ఆఫీసులో పలు డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు. అందులో RADCLIFFE స్కూల్ మేనేజ్‌మెంట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, పైన పేర్కొన్న విధంగా విద్యార్థులను తరగతులకు హాజరు కావడానికి, వేధింపులను ఆపడానికి వెంటనే అట్టి స్కూల్ మేనేజ్‌మెంట్‌ని డైరెక్ట్ చేయండి. ఫీజులు చెల్లింపుల కోసం పిల్లలపై జరుగుతున్న వేధింపులను ఆపడానికి తమ అధికార పరిధిలోని అన్ని ప్రైవేట్ స్కూల్లకు సర్క్యులర్‌ జారీ చేయండి.

మరో ప్రముఖమైన ఎస్సి & ఎస్టి ఆర్డర్స్ (సవరణ) చట్టం 1976ని అమలు చేయాలనే డిమాండ్‌ సమర్పించారు. 18.9.1976లో లేదా అంతకు ముందు మహారాష్ట్రలో నివసిస్తున్న ఎస్సి ఎస్టిలకు కుల ధృవీకరణ పత్రాలను జారీచేసి, రాష్ట్రంలో అన్ని సౌకర్యాలకు అర్హులను చేయండి. 1976న లేదా అంతకు ముందు రాష్ట్రంలో నివసిస్తున్న DT, NT, OBC, SBCలకి చెందిన వ్యక్తులకు కూడా తప్పనిసరిగా "కుల ధృవీకరణ పత్రాల"ను జారీ చేయాలని పొందుపర్చారు. 

ఈ నివేదిక సమర్పించిన బృందంలో మాజీ BMC కార్పొరేటర్ & BRS కొంకణ్ డివిజన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేంద్ర కన్సే, BRS ముంబై ప్రంతాధ్యక్షులు హేమంత్‌కుమార్ బద్ది, కళ్యాణ్ లోక్‌సభ కోఆర్డినేటర్ జయప్రకాష్ పవార్, ముంబ్రా కాల్వ అసెంబ్లీ కోఆర్డినేటర్ సంతోష్ దొనకొండ, బేలాపూర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ V. కృష్ణ యాదవ్, ముంబదేవి అసెంబ్లీ కోఆర్డినేటర్ టి. నరేష్ రజక్, యూనియన్ నాయకురాలు సవితా కన్సే, సైదులు గౌడ్, ఎలుగు లింగయ్య, బాసాని వెంకన్న, ఆరీఫ్ షేక్, గోపాల్ బద్ది, అల్తాఫ్ బలేవాలె తదితరులు పాల్గొన్నారు.