ఉదయనిధి స్టాలిన్ కు ఫూలే అంబేడ్కరీయుల మద్దతు

 

మెటపెల్లి  09.09.2023 : శనివారం జిల్లా జగిత్యాల, మెటపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ముంబై నుంచి విచ్చేసిన ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటీబిఎఫ్) కన్వీనర్ "తెలంగాణ లింక్" పత్రిక ఎడిటర్ బద్ది హేమంత్ కుమార్ తమిళనాడు ద్రవిడ యువనేత మంత్రివర్యులు ఉదయనిధి స్టాలిన్ కు మద్దతు తెలిపారు.

 "సనాతన ధర్మం" అంటేనే బ్రాహ్మణ ధర్మంపై ఎలాంటి తప్పుడు స్టేట్మెంట్ ఆయన చేయలేదని, వాస్తవంగా జరిగినది చెప్పడం జరిగిందని మనువాదులు ఆయనపై FIR చేయడంలో ఉదయనిధికి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్ష పడదని ఆయన భరోసా ఇచ్చారు.

దేశంలోని ఎస్సీ ఎస్టీలు హిందువులు అసల్కే కారు, వీళ్లను బ్రాహ్మణులు వారి వర్ణ వ్యవస్థకు బయట పెట్టి "అంటరానివారి" గా గుర్తించారు. 2198ఏండ్ల క్రితం పుష్యమిత్ర శుంగుడనే బాపనోడు సమ్రాట్ బృహదత్ ను కుట్రచే హత్య చేసి మా బీసీ మూలవాసులను సనాతన ధర్మంలో "శూద్రులు"గా మార్చారు. స్వీకరించలేని ఎస్సి ఎస్టిలను "అంటరానివారి"గా చేసి వారిపై దౌర్జన్యాలు ఇప్పటికి కొనసాగుతూనే ఉందని డాక్టర్ అంబేడ్కర్ "అంటచెబల్" "హు వేర్ శుద్రాస్" అనే గ్రంథంలో రాశడన్న చరిత్రను తెల్పారు. వర్ణకుల రహిత వ్యవస్థకై బాబాసాహెబ్ కృషి చేయగా, నేటికి విదేశీ ఆర్యులు అట్టి వ్యవస్థను కొనసాగిస్తూ నేన్నారని, దానివల్ల సమాజంలో "అసమానతలు" కొనసాగుతున్న మాటను ఉదయనిధి ఇప్పటి మాటల్లో చెప్పడం జరిగిందని, అందుకే తాము ఆయనకు మద్దతు పల్కుతున్నామని ఈ సందర్భంగా హేమంత్ వెల్లడించారు.

 తెలంగాణలోని ప్రతి మైనార్టీ బీసీ ఎస్సి ఎస్టిలు మన బీసీ మంగలి కులానికి చెందిన ఉదయనిధికి తోడుగా ఉండి ఆర్.ఎస్.ఎస్ మనువాదులకు చెక్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

 ఇందులో బామ్ సేఫ్ రాష్ట్ర ప్రచారకులు దయ్య రఘు, జర్నలిస్టులైన సామ్రాట్ అశోక్, అంగుళి మాలజీ, జి. రవీందర్ కటికె, ధర్మ సమాజ్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఉమేష్ మహారాజ్, ఎం.శ్రీధర్ మాలజీ, అల్లే పాండురంగ పద్మశాలి, రాజా గంగారాం పాల్గొన్నారు.