మోర్తాడ్ 09.09.2023 : జిల్లా నిజామాబాద్ మోర్తాడ్ మండలం లోని పాలెం గ్రామానికి చెందిన యువకుడు పోలీస్ సేవ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. చిన్ననాటి నుంచి చదువులో శ్రద్ధ వహించి, తాను ఆశించిన హోదాకు చేరిన ఘనత పలిగిరి ప్రేమ్ కుమార్ కు దక్కిందని ఆ గ్రామ ప్రజలు ఆనందంలో ఉన్నారు.
ఇటీవల ఆయన హైదరాబాద్ లో ఎస్సై పదవి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ప్రమోషన్ పొందారు. పాలెం ఊర్లో మరిముఖ్యంగా ఎస్సి వాడాలో ఎనలేని ఆనందం సంచరిస్తున్నది.
ఈ మేరకు ఆదివారం పలిగిరి ప్రేమ్ కుమార్ (మాల) పట్టణం నుంచి వారి సొంత గ్రామానికి విచ్చేసినందుకు పాలెం గ్రామ మాదిగ సంఘం, వై.యం.ఎస్ యూత్ సభ్యులు ఆత్మీయత మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలవ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం యువకులు చిన్ననాటి తీపి అనుభావాల్ని పంచుకున్నారు. ప్రమోషన్ తో విచ్చేసిన ప్రేమ్ కుమార్ ఊర్లో నిట్టనిలువునా ఉన్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని చూసి మనసారా సుమాంజలీలు తెల్పారు.