ఈ సందర్భగా ఎంటిబిఎఫ్ కన్వీనర్ సమ్రాట్ అశోక్ మాట్లాడుతూ వెంకటస్వామి సేవలను యాది చేస్తూ పెద్దపల్లి జిల్లాను "కాకా వెంకటస్వామి జిల్లాగా" నామకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇక ముందు మాట్లాడుతూ దివంగత కాకాజీ తన హయాంలోనే తొమ్మిది కాలేజీలను డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరున స్థాపించి డొనేషన్స్ లేకుండా విద్య సేవలను అందించారు అందిస్తున్నారు.
అదే విధంగా కాకాజీ 1969లో తొలిదశ తెలంగాణ పోరాటంలో పోలీస్ కాల్పులకు బులెట్ తగిలి చావు దగ్గరకి వెళ్లి తిరిగి వచ్చారని చరిత్రను వల్లించారు. మలిదశ ఉద్యమంలో సోనియా గాంధీని ఒపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర వహించిన ఘనత వెంకటస్వామి దేనని అశోక్ పేర్కొన్నారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో జర్నలిస్టులైన అంగుళి మాలజీ, మామిడి రాజు, డి.సంజయ్, జక్కం అశోక్ ముదిరాజ్, మురళి మహారాజ్, బి. ప్రణయ్ తదితర్లు పాల్గొని నివాళి అర్పించారు.