రామరావుపల్లెలో విద్యుత్ చోరీ

 

మెట్ పల్లి 19.09.2024 :16 సెప్టెంబర్ 2024 రోజున "తెలంగాణ లింక్" సంపాదకులు బద్ది హేమంత్ కుమార్ ఈమెల్ ద్వారా విద్యుత్ అధికారులకు జిల్లా జగిత్యాల మండలం మెట్ పల్లి, రామారావుపల్లె గ్రామంలో లతీఫా హోటల్  కేటగిరి 1 మీటర్ తో హోటల్ లో  విద్యుత్ దొంగతనం చేస్తున్నారు అట్లనే కేబుల్ ఆపరేటర్ రవిబాబు తన ఇంటిలో కేటగిరి 1 మీటర్ తో  కేబుల్ ఆపరేటర్ గా విద్యుత్ దొంగతనం  చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో సెక్షన్ 135 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం విద్యుత్ దొంగతనంగా గుర్తించబడింది. అయితే ఈ రోజు అనగా గురువారం విజిలెన్స్ అధికారులు డిఈఈ DPE కరీంనగర్, కోరుట్ల రూరల్ ఎఇ ఇతర సిబ్బంది వచ్చి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇలాంటి విద్యుత్ చోరీ పై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కావున చట్ట విరుద్ధ కార్యకలాపాలు తమ జిల్లాలో జర్గనివ్వకుండ అధికారులు చర్యలు చేపట్టాలని సామాన్య జనం కోరుతున్నారు.

- ముల నివాసి మాల జీ