విఠల్ సాయన్న ఆస్పత్రి పేరులో "యాదవ" నామకరణ కావాలి

థానే 14.01.2025 : ముంబై నిర్మాణంలో మన కురుమ గొల్ల ముద్దుబిడ్డ విఠల్ సాయన్న ప్రముఖ పాత్ర ఉందన్న విషయం విధితమే. థానే జిల్లా సిటీలో 1936లో సాయన్న సామాన్యప్రజల కోసం హాస్పిటల్ నిర్మించారు. దీనికి అనుకోని నర్సుల కోసం వసతి గృహం, ధర్మశాలలను కూడా నిర్మించిన ఘనత ఉంది. దీనికి అప్పట్లో "వి.సా థానే జిల్లా ఆస్పటల్" అని పేరు పెట్టారు. అయితే గత రెండేళ్ల నుంచి అట్టి ఆసుపత్రి పునరుద్ధరణలో ఉండడం వల్ల గత ఏడాది నుంచి తీన్ హాథ్ స్థలంలో ఈ వేడుకలు జరుతున్నాయి. మంగళవారం "విఠల్ సాయన్న యాదవ్ జయంతి ఉత్సవ సమితి" ఆధ్వర్యంలో అదే ప్రణగంలో ఆయన 159వ జయంతి ఘనంగా నిర్వహించారు. గత 16 ఏండ్ల నుంచి జన్మదిన వేడుకలు జరుపుతూనే, అదే సమయంలో ఆసుపత్రి పేరులో "వి.సా" కు బదులుగా "విఠల్ సాయన్న"గా నామకరణం చేయాలని సమితి సభ్యులు సంబంధిత అధికారులకు వినతి పత్రాలీచ్చారు. అనంతరం అది రూపుదాల్చింది. ఇందులో ఆస్పత్రి డా. కైలాస్ పవార్ తోసహా భోగ సుదర్శన్ పద్మశాలి, మిలింద్ సెలార్, సిరిమల్లె శ్రీనివాస్, మూలనివాసి మాలజీ తదితర్ల కృషివుంది. 

నేటీ కార్యక్రమంలో స్టేజిపై ఫ్యామిలీ సభ్యులైన జగన్నాథ్ ఎన్.యాదవ్, లలీత ఎచ్.యాదవ్, హితేంద్ర ఎచ్.యాదవ్, దిగంబర్ వి.యాదవ్ లతోపాటు వక్తగా జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ కైలాస్ పవార్ మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ నెలలో నూతన హాస్పిటల్ భవ్యదివ్యంగా రూపుదిద్దుకొని ప్రారంభం కానున్నదని, ఆసుపత్రి పేరులో "యాదవ్" పదం జోడిస్తూ "విఠల్ సాయన్న యాదవ్ థానే సివిల్ హాస్పిటల్" గా బోర్డు పెట్టనున్నామని, విగ్రహం తోపాటు ఆయన చరిత్రను ప్రజలకై ఏర్పాటు చేయనున్నామని సభ ముఖాన హామీచ్చారు. 

డాక్టర్ విలాస్ సాల్వే సాయన్నపై ఓ పద్యం ఆలపించారు. జిల్లా అడిషనల్ సివిల్ సర్జన్ డా. ధీరజ్ మహాన్గాడే, డా. మృణాళిని, "సమితి" ప్రముఖుడైన బోగ సుదర్శన్, అనసూయ బోగ, మిలింద్ సెలార్, బొమ్మకంటి లక్ష్మణ్, నడిగొట్టు శ్రీనివాస్, ఎన్.గణేష్ నాయి, ఎన్.తిరుపతి నాయి, మహేసుల సాగర్, విలాస్ మోరె, సభకు మూలనివాసి మాలజీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

- ఎం. మాలజీ : 9869010890